నేనెప్పుడూ నిత్య విద్యార్థినే : కమల్

నేనెప్పుడూ నిత్య విద్యార్థినే : కమల్ I will always be a student: Kamal 

"స్టార్గా నాకు పుట్టినిల్లు తెలుగు చిత్ర పరిశ్రమే. నాకు ఎన్నో మంచి సినిమాల్ని నిర్మించే శక్తిని చ్చింది ఇక్కడి ప్రేక్షకులే" అన్నారు కథానాయకుడు కమల్ హాసన్. ఇప్పుడాయన నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్'. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. త్రిష కథానా యిక. శింబు, జోజు జార్జ్, నాజర్, తనికెళ్ల భరణి, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషిం చారు. ఈ సినిమా శ్రేష్ట్ మూవీస్ సంస్థ ద్వారా జూన్ 5న తెలుగులోకి రానుంది. ఈ నేపథ్యం లోనే గురువారం రాత్రి హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మణిరత్నం అప్పటికీ ఇప్పటికీ దర్శకుడిగా చాలా మారారు. ఆ మార్పు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. మా మధ్య నుంచి ఇన్నేళ్ల విరామం తర్వాత సినిమా రావడానికి కారణం నేనే. నన్ను అందరూ ద్రోణాచార్యుడు.. గురువు అంటున్నారు. దయచేసి నా నుంచి ఏ పాఠాలు ఆశించకండి. ఎందుకంటే సినిమాకి నేనెప్పుడూ నిత్య విద్యార్థినే. నేర్పడానికి సిద్ధంగా ఉండాలంటే ముందు నేనింకా నేర్చుకోవాలి. కెరీర్ ఆరంభం నుంచి నిత్యం నేనదే పని చేస్తున్నా. అందుకే నన్ను గురువు అనకండి. గుర్తుపెట్టుకోండి చాలు. నేను మంచి సినిమాలకు అభిమానిని. అలాంటి చిత్రాలు అందించేందుకు ఎంతైనా కష్టపడతా. నేను నా జీవితంలో ప్రతిదీ సినిమా ద్వారానే నేర్చుకున్నా. నటన ద్వారానే తమిళం, తెలుగు, మలయాళం.. ఇలా ప్రతి భాషా నేర్చుకున్నా. ఈ 'థగ్ లైఫ్' నాకెంతో ఇష్టమైన చిత్రం. మేమంతా ఎంతో ఇష్టపడి, కష్టపడి చేశాం. ఈ సినిమా నుంచి.. పాత్ర నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయమే పడు తుంది. నేనీ చిత్రం చూశా. తప్పకుండా ఇది 'నాయగన్' కంటే చాలా పెద్ద సినిమా అవుతుందని మాటిస్తున్నా. ప్రేక్షకుల స్పందన చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా" అన్నారు. "అందరి లాగే నేనూ కమల్ - మణిరత్నంల 'నాయగన్' చిత్రం చూస్తూ పెరిగాను. వాళ్లిద్దరూ కలిసి 37 ఏళ్ల తర్వాత ఇలా ఈ సినిమాతో రావడం.. నేనిందులో భాగమవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంది త్రిష దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. “నా 'మౌనరాగం' సినిమా విడుదలయ్యాక ఓసారి నిర్మాత ముక్తా శ్రీనివాసన్ ఓరోజు మా ఇంటికి వచ్చారు. తను నా చేతికి ఓ కవర్ ఇచ్చి.. 'కమల్ సర్ అందులో ఉన్న హిందీ సినిమాని మిమ్మల్ని చూడమని చెప్పారన్నారు. నేను ఆ చిత్రం చూశాక దాన్ని రీమేక్ చేయలేనని చెప్పేశా. కానీ, ఆ నిర్మాత అదే మాట నేరుగా కమల్కి చెప్పమని కారులో ఏవీఎం స్టూడియోకి తీసుకెళ్లారు. అప్పుడదే మాట మళ్లీ ఆయనతో చెప్తే.. 'సరే నాతో చేయడానికి ఏ కథతే బాగుంటుందో చెప్పమ'ని అనడంతో ఆశ్చర్యపోయా. అప్పుడలా చర్చిస్తూ అనుకోకుండా 'నాయగన్' చిత్రం పురుడుపోసుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'థగ్ లైఫ్' విషయంలోనూ అదే జరిగింది. ఓరోజు కమల్ ఫోన్ చేసి కలిసి సినిమా చేద్దామన్నారు. అలా ఇన్నేళ్ల విరామం తర్వాత మా ఇద్దరి కలయికలో రెండో సినిమా సాకారమైంది" అన్నారు. ని ర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "కమల్హాసన్ గత రెండు చిత్రాల్ని తెలుగులో నేనే విడుదల చేశా. అవి బ్లాక్బస్టర్ హిట్గా నిలిచాయి. ఈ చిత్ర ట్రైలర్, పాటలు చూశాక ఇది కమల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్గా నిలుస్తుందని నమ్మకం ఏర్పడింది" అన్నారు. ఈ కార్యక్రమంలో శింబు, సుహాసిని, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.

 "As a star, my birthplace is the Telugu film industry. I have the power to produce many good films." "It was the audience here that gave it," said hero Kamal Haasan. Now, the Pan India film 'Thug Life'. Directed by Mani Ratnam, this film is produced by Raj Kamal Films. International, Madras Talkies and Red Giant jointly produced. Trisha, Simbu, Joju George, Nassar, Tanikella Bharani, Abhirami and others are playing key roles. Charu. This film will be released in Telugu on June 5th through Shreshth Movies. This background A press conference was organized in Hyderabad on Thursday night. On this occasion Hero Kamal Haasan said, “Maniratnam has changed a lot as a director since then. That change will surprise the audience. After a gap of so many years between us, the film I am the reason for coming. Everyone calls me Dronacharya.. Guru. Please accept my Don't expect any lessons from me. Because I am always a student of cinema. To teach I still have to learn to be ready. I've been working on myself since the beginning of my career. I'm doing it. So don't call me a teacher. Just remember. I'm good at good movies. I am a fan. I will try my best to provide such pictures. I will do everything in my life I learned through cinema. Through acting, I learned Tamil, Telugu, Malayalam..everything. I learned the language. This 'Thug Life' is my favorite movie. We all loved it and worked hard. We did it. It took me a long time to get out of this movie.. the character. I have seen this film. I am sure it will be a much bigger film than 'Nayagan'. "I'm talking. I'm eagerly waiting to see the audience's reaction," he said. "Everyone Similarly, I grew up watching Kamal and Mani Ratnam's film 'Nayagan'. Together they were 37. Coming back with this film after years... I am very happy to be a part of it. "I'm looking forward to seeing how the audience will enjoy it," said Trisha. Director Mani Ratnam said, "Once after the release of my film 'Mounaragam', Producer Mukta Srinivasan came to my house one day. He handed me a cover.. "Kamal sir asked you to watch the Hindi movie that was in it. I said, 'I After watching the film, I said that I can't remake it. But the producer said the same thing directly to Kamal. They took him to the AVM studio in a car to tell him. Then when I told him the same thing again.. 'Okay I was surprised when he said, "Tell me what story would be good to do with me." Then Unexpectedly, the film 'Nayagan' was released while discussing it. Again, after all these years, 'Thug Life' The same thing happened in this case. One day Kamal called and said let's do a film together. So "After a gap of many years, our second film together has come true," he said. Rmatha Sudhakar Reddy said, "I released Kamal Haasan's last two films in Telugu myself. They were blockbuster hits. After watching the trailer and songs of this film, this is Kamal's career. "I am confident that it will become the biggest blockbuster hit in the year," he said. Simbu, Suhasini, Ashok Selvan, Abhirami, Nassar, Tanikella Bharani and others participated.


PUBLISHED IN EENADU DAILY TELUGU NEWSPAPER DATED 2305/2025

 

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com