Regular updates will be back! Sorry for the short break, everyone. Thank you for your patience and support! ❤️ Regular content will resume soon. Stay tuned! 🔥 

With Love
YT Praveen Kanna 
Admin

Idhu Namma Aalu Dubbed into Telugu as Sarasudu



విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకొన్నారు... శింబు- నయనతార. ఒకప్పుడు తరచుగా కలిసి తెరపై మెరిసిన ఈ ఇద్దరూ చాలా కాలం తర్వాత జోడీ కట్టి పాండిరాజ్‌ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేశారు. తమిళంలో ‘ఇదు నమ్మ ఆళ్‌’గా విడుదలైన ఆ చిత్రం త్వరలోనే తెలుగులో ‘సరసుడు’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆండ్రియా, ఆదాశర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శింబు సినీ ఆర్ట్స్‌ పతాకంపై టి.రాజేందర్‌ నిర్మించారు. ఈ నెలాఖరున పాటల్ని విడుదల చేస్తారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తమిళంలో తెరకెక్కించిన ‘ఇదు నమ్మ ఆళ్‌’ ఘన విజయం సాధించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల తెలుగులో ‘సరసుడు’ని విడుదల చేయడం కాస్త ఆలస్యమైంది. ఐటీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథ ఇది. యువతరం ఎలా ప్రేమించుకొంటున్నారు? ఎలా విడిపోతున్నారు? అనే విషయాల్ని ఇందులో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. శింబు, నయనతార జోడీ మరోసారి అలరిస్తుంది. మా చిన్నబ్బాయి, శింబు తమ్ముడు కురళ అరసన్‌ స్వరాలు సమకూర్చాడు. ‘కుర్రాడొచ్చాడు’ తర్వాత నేను మాటల్ని, పాటల్ని రాసింది కూడా ఈ చిత్రానికే. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సత్యం రాజేష్‌, సూరి, సంతానం, జయప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం

Published in EENADU Daily Telugu News Paper Dated 5/2/2017

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com