చలో మలేషియా


దాదాపు ఇరవై రోజులకు సరిపడ సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నారు హీరో శింబు. ఇంతకీ ఎక్కడికెళుతున్నారనేగా మీ సందేహం. ఆయన మలేషియాకు వెళ్లబోతున్నారు. శింబు హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘మనాడు’ అనే పొలిటికల్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు బరువు తగ్గడమే కాకుండా, మార్షల్‌ ఆర్ట్స్‌లో ఫారిన్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 25న ప్రారంభం కానుందని కోలీవుడ్‌ సమాచారం. ఈ షెడ్యూల్‌ దాదాపు నెల రోజులు ఉంటుందట. మలేషియాలో హీరోహీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను కూడా ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు.

PUBLISHED IN SHAKSHI DAILY  TELUGU NEWS PAPER DATED 9/6/2019

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com