తమిళ నటుడు శింబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘ఈశ్వరుడు’. నిధి అగర్వాల్ కథానాయిక. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో శింబు బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా కనిపించారు. తనదైన స్టైల్‌లో లుంగీ కట్టుకొని, పడగవిప్పిన పామును మెడమీద వేసుకొని ఉన్న పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం తమన్. డీ కంపెనీ-కేవీ దురై బ్యానర్‌పై బాలాజీ కపా నిర్మిస్తున్నారు.
Tamil actor Shimbu is playing the hero in the new movie 'Ishwaradu'. Nidhi Agarwal is the heroine. The film is set to hit theaters next year. On the occasion of Vijayadashami, the film crew released the first look poster of the film. In this, Shimbu lost a lot of weight and looked smart. The poster impresses the fans, wearing a lungi in its own style and a draped snake around its neck. Sushindran is directing the film, which is set in a rural setting. Music Taman. Balaji Kapa is building on the banner of D Company-KV Durai.
PUBLISHED IN AANDHRA JYOTHI DAILY TELUGU NEWS PAPER DATED 28/10/2020
PUBLISHED IN V6VELUGU DAILY TELUGU NEWS PAPER DATED 28/10/2020
PUBLISHED IN EENAADU DAILY TELUGU NEWS PAPER DATED 28/10/2020
0 Comments:
Post a Comment