మద్యానికి తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు తమిళ హీరో శింబు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మానాడు’. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్విట్టర్‌లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రబృందంతో కలసి శింబు పాల్గొన్నారు. మాటల సందర్భంలో ఆయన తాను మద్యానికి దూరమై ఏడాదికి పైనే అయిందని చెప్పారు. ‘‘పలు సందర్భాల్లో పార్టీల్లో పాల్గొన్నప్పటికీ మనో నిగ్రహం కోల్పోలేదు, మద్యం జోలికి వెళ్లలేదు. ఆ నిర్ణయం నాకు చాలా మేలు చేసింది’’ అని శింబు చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘ఈశ్వరన్’, పాథ్తుతల’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘మహా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Tamil hero Simbu says he stays away from alcohol. Maanaadu is a movie directed by Venkat Prabhu in which he plays the protagonist. The film is expected to release on August 14. Simbu recently took part in a promotion event on Twitter with the film crew. In the context of the words, he said that he had been away from alcohol for over a year. "Despite participating in parties on many occasions, he did not lose his temper and did not go for alcohol. That decision was very good for me, "said Simbu. He is currently starring in 'Eeswaran' and 'Pathuthala'. 'Maha' is ready for release.
PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TELUGU NEWSPAPER DATED 23.06.2021
0 Comments:
Post a Comment