కోలీవుడ్ హీరో శింబు గత సంక్రాంతికి ‘ఈశ్వరన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు శింబు, కళ్యాణి ప్రియదర్శిని నటించిన ‘మానాడు’ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత గౌతం కార్తీక్ దర్శకత్వంలో ‘పత్తు తల’ అనే చిత్రంలోను, గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి ‘నదిగళిల్ నీరాడుమ్ సూరియన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదిలా ఉండగా స్టార్ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ చిత్రాన్ని నిర్మించిన ఏజీఎస్ నిర్మాణ సంస్థతో శింబు ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టులో శింబు నటించేందుకు కమిట్ అయ్యారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Kollywood hero Simbu came forward to the audience as 'Eewaran' for the last Sankranthi. Now 'Maanaadu' starring Simbu and Kalyani Priyadarshini is celebrating its post-production milestones. The film is scheduled to release in October. After this, he will act in the movie 'Pattu Tala' directed by Gautam Karthik and the third movie directed by Gautam Menon. The title of the film is 'Nadigalil Neeradum Suriyan'. Meanwhile, the news is coming that Simbu has signed a deal with AGS production company which produced the movie 'Bigil' starring star hero Vijay. The company is committed to starring Simbu in a new project. Kollywood sources said that work on the project is in full swing.
PUBLISHED IN ANDHRA JYOHY DAILY TELUGU NEWS PAPER DATED 30/06/2021
0 Comments:
Post a Comment