ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా రూపొందించిన ఆల్బమ్ కోసం హీరో శిలంబరసన్ టీఆర్(శింబు) గాయకుడుగా మారారు. ఈ ఆల్బమ్ త్వరలోనే విడుదల చేయనున్నారు. యువన్, శింబుల మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మన్మథన్’, ‘వల్లవన్’, ‘సిలంబాట్టం’, ‘వానమ్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల్లోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన ‘మానాడు’ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజానే సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో యువన్ సొంతంగా తయారు చేసిన ఒక ఆల్బమ్ కోసం శింబు గాయకుడుగా మారారు. గతంలో పలు చిత్రాల్లో పాటలు పాడిన అనుభవం ఈ హీరోకు ఉంది. దీంతో ఈ ఆల్బమ్ కోసం శింబు ఓ పాటను అలపించారు. మరోవైపు, ఈ ఆల్బమ్‌లో కోసం నటుడు కాళిదాస్ జయరామ్, నటి మేఘా ఆకా్‌షలు నటించగా, శాండి కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ ఆల్బమ్‌ను విడుదల చేసేందుకు యువన్ ప్రయత్నిస్తున్నారు.
Hero Silambarasan has become the singer for the album produced by music director Yuvan Shankar Raja. This album will be released soon. Yuvan, Simbu has a good friendship. That is why the combination of the two films like 'Manmathan', 'Vallavan', 'Silambattam' and 'Vaanam' came out very well, the songs in these films were well received by the audience. Yuvan Shankar Raja has also composed music for the film 'Maanadu' currently starring Shimbu under the direction of Venkat Prabhu. The first song in the film was recently released. This hero has the experience of singing songs in many films in the past. With this, Simbu sang a song for this album. On the other hand, actor Kalidas Jayaram, actress Megha Akash acted in lead and Sandy is the choreographer for this album.
PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TELUGU NEWSPAPER DATED 2/7/2021
0 Comments:
Post a Comment