కన్నీళ్లొచ్చాయి

‘‘మన్మథతో నన్ను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదిరించారు. వాళ్లకు మళ్లీ అంతగా నచ్చే చిత్రంగా ‘లూప్‌’ నిలుస్తుంద’’న్నారు శింబు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ ‘‘ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌. సైన్స్‌ ఫిక్షన్‌ని మేళవించాం. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం సామాన్యుల్ని ఎలా వాడుకుంటున్నారో ఈ కథలో చెప్పాం. టైమ్‌ లూప్‌ నేపథ్యంలో దక్షిణాదిన చాలా తక్కువ సినిమాలొచ్చాయి. కాబట్టి.. ఈ కాన్సెప్ట్‌ కొత్తగానూ, వింతగానూ ఉంటుంది. కానీ దర్శకుడు వెంకట్‌ ప్రభు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ కథని చూపించారు. ఎస్‌.జె.సూర్య పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించారు. మా ఇద్దరి మధ్య టామ్‌ అండ్‌ జెర్రీలాంటి పోటీ జరుగుతుంటుంది. కల్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటించింది. తన పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పొలిటికల్‌ థ్రిల్లర్‌ కాబట్టి.. రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. మఽధ్యలో సినిమా ఆగిపోయింది. సినిమా పూర్తిచేయడానికి మూడేళ్ల సమయం పట్టిందంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో ఆలోచించండి. ఆ కష్టాలన్నీ గుర్తుకురావడం వల్లే... ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. 

 "I was well received by the Telugu audience with Manmatha. "Loop" will be their favorite movie again, "said Shimbu. The movie starring him as the protagonist will be released on the 25th of this month. "It's a political thriller," Shimbu said. Combined with science fiction. In this story we will tell how some selfish politicians are using the common man for their existence. Very few films in the South have been made in the context of the Time Loop.

PUBLISHED IN ANDHRA JYOTHY DAILY TELUGU NEWSPAPER DATED 22.11.2021

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com