ఆ కష్టాలన్నీ గుర్తొచ్చాయి

‘కథాంశాల పరంగా ఉన్న భాషాపరమైన హద్దులు తొలగిపోతున్నాయి. మంచి కథ, పాత్ర దొరికితే నేను తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తా’ అని అన్నారు శింబు. తమిళంలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. శింబు నటించిన తాజా చిత్రం ‘లూప్‌’. వెంకట్‌ప్రభు దర్శకుడు. సురేష్‌ నిర్మించారు. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో శింబు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...

‘Linguistic boundaries in terms of storylines are being removed. If I can find a good story and character, I will make a straight film in Telugu, 'said Shimbu. Recognized as one of the top heroes in Tamil. Shimbu's latest film is 'Loop'. Venkatprabhu is the director. Produced by Suresh. It will be released on the 25th of this month. On this occasion, Shimbu shared with the journalists in Hyderabad on Sunday.


టైటిల్‌కు తగినట్లుగానే ఈ సినిమా ప్రచార చిత్రాలు వైవిధ్యంగా ఉన్నాయి? ఇది ప్రయోగాత్మక చిత్రం అనుకోవచ్చా? Are the promotional films for this film as diverse as the title suggests? Can it be considered an experimental film? 

‘సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రాజకీయ చదరంగంలో ఓ సామాన్యుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అతడి జీవితంలో ఒకే సంఘటన మళ్లీ మళ్లీ ఎందుకు జరిగింది? తనపై పడిన ఓ నింద నుంచి అతడు ఎలా నిరపరాధిగా బయటపడ్డాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా కాదిది. కానీ ఇందులో చూపించిన అంశాలతో ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. రాజకీయస్వార్థం కోసం సామాన్యులను రాజకీయనాయకులు ఎలా పావులుగా వాడుకుంటారో ఇందులో చూపించాం. విభిన్నమైన ప్రయత్నంగా తెలుగు ప్రేక్షక 

It is a political action entertainer with a sci-fi storyline. What kind of difficulties did a common man face in political chess? Why did the same event happen again and again in his life? The film is about how he escaped from a reproach that fell on him. It is not a film based on real events. But the audience will be connected with the elements shown in it. It shows how politicians use the common man as a pawn for political gain. Telugu audience as a different endeavor.


దర్శకుడు వెంకట్‌ప్రభు చెప్పిన కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి? What impressed you most about the story told by director Venkat Prabhu? 

ఎస్‌జే సూర్య ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారు. టామ్‌ అండ్‌ జెర్రీ తరహాలో మా ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. కల్యాణి ప్రియదర్శినితో నా లవ్‌ట్రాక్‌ రెగ్యులర్‌ ప్రేమకథలతో పోలిస్తే వినూత్నంగా అనిపిస్తుంది. హీరో ఎదుర్కొనే సవాళ్లు కొత్తగా ఉంటాయి టైమ్‌లూప్‌ అనే పాయింట్‌ను అందరికి అర్థమయ్యే రీతిలో సింపుల్‌గా వెంకట్‌ప్రభు ఈ సినిమాలో చూపించారు. ఆయనతో చాలా కాలంగా పనిచేయాలన్న నా కల ఈ సినిమాతో తీరింది. 

SJ Surya will be seen in the film as a police officer. Like Tom and Jerry, our two characters are in competition. My lovetrack with Kalyani Priyadarshini feels innovative compared to regular love stories. The challenges faced by the hero are new. Venkat Prabhu has shown the point of time loop in a simple way in a way that everyone can understand. My dream of working with him for a long time came true with this film. 

‘మన్మధ’తో తెలుగులో మీకు మంచి గుర్తింపు వచ్చింది? అయినా మీ సినిమాలు ఎక్కువగా తెలుగులో విడుదలకాలేదు? Did you get good recognition in Telugu with 'Manmadha'? However, most of your films are not released in Telugu? 

కొత్తదనాన్ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ప్రయోగాత్మకంగా భావించి ‘మన్మధ’ సినిమా చేశా. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో ఆ సినిమాను రీమేక్‌ చేయాలనుకున్నాం. నెగెటివ్‌ షేడ్స్‌తో కూడిన పాత్రలో నటించడానికి హీరోలెవరూ ముందుకు రాలేదు. దాంతో తెలుగులో ఆడుతుందనే నమ్మకంతో డబ్‌చేశాం. మా అంచనాలకు మించి సినిమా విజయాన్ని అందుకుంది. అదే నమ్మకం ఈ సినిమా విషయంలో ఉంది. 

Telugu audiences take the lead in embracing something new. I made the movie 'Manmadha' thinking it was experimental. Was a great success in Tamil. We wanted to remake the movie in Telugu. None of the heroes came forward to play a role with negative shades. With that, we dubbed with the belief that it will be played in Telugu. The film was a success beyond our expectations. The same belief is present in the case of this film. 

 ఈ సినిమా కోసమే బరువు తగ్గి సన్నబడినట్లున్నారు? Weight loss will be followed by fatigue and constant tiredness. 

కరోనా విరామంలో ఇరవై ఏడు కిలలో బరువు తగ్గా. ఈ సినిమాకు ముందు నా కెరీర్‌ బ్యాడ్‌ఫేజ్‌లో ఉంది. ఆ సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మానసికంగా,ఆధ్యాత్మికంగా నా ఆలోచణ ధోరణిలో మార్పులు చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో బరువు తగ్గడంపై దృష్టిపెట్టా. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి వర్కవుట్స్‌ చేయడం మొదలుపెట్టా. దాదాపు ఇరవై ఏడు కిలోల తగ్గా. ఆల్కహాల్‌ తాగడం, నాన్‌వెజ్‌ తినడం మానేశాను. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తున్నది. 

Weight loss of twenty-seven kg during the corona break. My career was in a bad phase before this movie. Even if I decide to make changes in my way of thinking mentally and spiritually to get out of those complicated situations. At the same time the focus was on weight loss as the shooting stopped due to the corona. Get up at 4am every morning and start doing workouts‌. Lost about twenty-seven kilos. I stopped drinking alcohol and eating non-veg. Feels very comfortable now.

 ప్రీ రిలీజ్‌ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్నారు? Tears at the pre-release ceremony? 

సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా. అయినా ఏనాడు అధైర్యపడకుండా ఆ కష్టాలన్నింటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ వచ్చాను. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. ఎన్నో అడ్డంకులను దాటాం . పొలిటికల్‌ ఫిల్మ్‌ అని ప్రకటించడంతో కొన్ని రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. నిర్మాణపరమైన కారణాలతో ఒకానొకదశలో సినిమా ఆగిపోయింది. ఆ కష్టాలన్నీ ప్రీ రిలీజ్‌ వేడుకలో గుర్తురాగానే కన్నీళ్లు ఆగలేదు. చాలా ఎమోషనల్‌ అయ్యాను. 

Despite many ups and downs in the cine journey. Yet I have never been discouraged and have accepted all those hardships with a smile. It took three years to bring this film to the front of the audience. Let's cross many obstacles. There was some political pressure to declare it a political film. The film was stopped at one stage due to structural reasons. The tears did not stop when I remembered all those hardships at the pre-release ceremony. I became very emotional. 

 పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? When are you going to get married? 

మంచి అమ్మాయిని వెతికిపెట్టండి. తప్పకుండా పెళ్లిచేసుకుంటా. 

Find a good girl. Definitely getting married.


తదుపరి సినిమా విశేషాలేమిటి? What's next? 

గౌతమ్‌మీనన్‌తో ‘వీటీకే’ అనే సినిమా చేస్తున్నా. మా ఇద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రమిది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్నది. గౌతమ్‌కార్తిక్‌, నేను హీరోలుగా ‘పాథు తల’ అనే సినిమా తెరకెక్కనున్నది. తమిళనాడులోని ఫస్ట్‌ కరోనా పేషెంట్‌ కథతో ‘కరోనా కుమార్‌’ కామెడీ సినిమా చేస్తున్నా. 

Im doing a movie called 'VTK' with Gautam Minan. This is the third film coming in the combination of the two of us. Forming in Tamil and Telugu languages. Gautam Karthik and I will be the heroes in the movie 'Pathu Thala'. ‘Corona Kumar’ is making a comedy film with the story of the first corona patient in Tamil Nadu.


PUBLISHED IN NAMASTHE TELANGANA DAILY TELUGU NEWSPAPER DATED 22.11.21

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com