Simbu: రామ్‌ సినిమాలో బుల్లెట్‌ సాంగ్‌ పాడిన శింబు



ది వారియర్‌కు పాట పాడారు తమిళ హీరో, సింగర్‌ శింబు. రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్‌. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్‌ కానుంది. కాగా ఈ సినిమాలో బుల్లెట్‌ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్‌, దేవి శ్రీ ప్రసాద్‌లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్‌ పాట పాడారు. ఇది ఒక మాస్‌ నెంబర్‌. ఇటీవల ఇంట్రవెల్‌ సీన్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్‌, కెమెరా : సుజీత్‌ వాసుదేవ్‌. 

Tamil hero, Singer Shimbu sang for The Warrior . The upcoming movie The Warrior is directed by Lingusamy as Ram Hero. Srinivasa Chittoori is being produced by Pawan Kumar. Akshara Gowda will be seen in a pivotal role as Adi Pinchetti's villain in the film, which stars Kriti Shetty as the heroine. The film will be released in Telugu and Tamil on July 14. In this movie, Shimbu sang a song called 'Bullet'. Srinivasa Chittoori says .. Shimbu sang the bullet song in our movie because of his friendship with Ram and Devi Sri Prasad. This is a mass number. Recently a song was filmed on the heroines along with the interlude scene. Our movie shooting is nearing completion. Music by Devisriprasad, Camera: Sujeet Vasudev.

PUBLISHED IN SHAKSHI DAILY TELUGU NEWSPAPER DATED 18-04-2022

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com