సీతారామం' చిత్రంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పైగా ఈ మూవీ ఆమె కెరీర్ లోనే గొప్ప మలుపు కావడంతో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. కానీ ఆమె మాత్రం కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది. గతేడాది వచ్చిన ఆమె రెండో చిత్రం 'హాయ్ నాన్న' కూడా మంచి హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం విజయ్ దేవర కొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయం సాధించడంతో అభిమానులు అదృ ష్టనాయిక అంటూ అభివర్ణిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మృణాలకు తమిళం నుంచి కూడా భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే శివ కార్తికేయన్, శింబు (Simbu) చిత్రాల్లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈ భామ, అగ్ర హీరో
అజిత్ సరసన కూడా కథానాయికగా నటించబో తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేయబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిం చగా తాజాగా ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ దక్కించు కుందని సమాచారం. ఇక తమిళంలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయని మృణాల్ని ఇలా భారీ అవకాశాలు దక్కడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.
- దిశ, సినిమా
PUBLISHED IN DISHA DAILY TELUGU NEWSPAPER DATED 11/02/2024
0 Comments:
Post a Comment