‘థగ్‌లైఫ్‌’ షూటింగ్‌లో ప్రమాదం


సినీ నటులకు సుఖాలే కాదు…కష్టాలూ ఎదురవుతుంటాయి. పలువురు నటీనటులు షూటింగ్‌లో ప్రమాదాలకు గురైన సంఘటలను ఉన్నాయి. కాగా తాజాగా కమల్‌హాసన్‌ చిత్రం థగ్‌లైఫ్‌ షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. నటుడు కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. నటుడు శింబు, త్రిష, మలయాళ నటుడు జోజూ జార్జ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పుటికే రాజస్థాన్‌, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో జరుపుకుని, 60 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నటుడు కమలహాసన్‌ ప్రతినాయకులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. షఉటింగ్‌ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచి మలయాళ నటుడు జోజూ జార్జ్‌ కిందికి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలి ఎముక విరిగింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్‌ సూచించినట్లుగా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఆయన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి పంపించారు. మిగతా షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌ ఐరోపాకు బయలు దేరనున్నట్లు వెల్లడించింది.

Film actors have not only pleasures but also hardships. There have been incidents where many actors have met with accidents while shooting. Recently there was an accident in the shooting of Kamal Haasan's film Thuglife. The film is being directed by Mani Ratnam with actor Kamal Haasan as the hero. Actor Simbu, Trisha and Malayalam actor Joju George are playing the lead roles. The shooting of this film has already been held in Rajasthan, Delhi, Kerala and other places and 60 percent has been completed. Currently shooting is going on in Pondicherry. There, director Mani Ratnam is filming the scenes where actor Kamal Haasan fights with the villains. Malayalam actor Joju George met with an accident while jumping down from the helicopter during the shooting. This broke his leg bone. The film crew announced that the doctor advised them to rest for a few days. So he was sent to Kochi in Kerala state. It has been revealed that the film unit will leave for Europe for the rest of the shooting.

PUBLISHED IN Prajasakti DAILY TELUGU NEWSPAPER DATED 15.06 .2024

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com