శింబు, మోహన్‌లాల్‌ కాంబోలో చిత్రం?

తమిళసినిమా: సంచలన నటుడు శింబు ప్రస్తుతం కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న థగ్‌లైఫ్‌ చిత్రంలో ముఖ్యపాత్రను పోషి స్తున్న విషయం తెలిసిందే. మణితర్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన "ఇ మెడ్రాస్‌ టాకీస్‌, కమలహాసన్‌ రాజ్‌కమల్‌ టై ఫిలిం ఇంటర్నేషనల్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ చిత్రం  హ్‌ ది. ఈ చిత్రం తరువాత శింబు తన 48వ చిత్రాన్ని దేశింగ్‌ పెరియసామి దర్శకత్వంలో కమలహాసన్‌ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషన్‌లో చేయనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలి సిందే, అయితే తాజాగా ఈ చిత్రాన్ని వేరే సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని అటుంచితే శింబు మరో నూతన చిత్రానికి కమిట్‌ అయినట్లు తాజగా జరుగుతున్న ప్రచారం. ఈయన నిర్మాత ఐసరి గణేశ్‌కు ఓచిత్రం చేయాల్సి ఉంది. దీంతో తన తాజా చిత్రాన్ని ఆ సంస్థకు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే మలయాళ దర్శకుడు జూడ్‌ ఆంటోని జోసఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 2018 మలయాళ చిత్ర దర్శకుడు జూడ్‌ అం టోని జోసఫ్‌ అన్నది గమనార్హం, కాగా శింబు హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మలయాళ సూప ర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన భూమికను పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబం ధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.


PUBLISHED IN SHAKSHI DAILY TELUGU NEWSPAPER DATED 11.07.2024

ENGLISH TRASLATION

Simbu, Mohanlal combo movie? 

Tamil Cinema: Sensational actor Simbu is currently playing the lead role in Thugl ife starring Kamal Haasan. This film is directed by Manitharanam and It is produced by Madras Talkies, Kamal Haasan's Rajkamal Film International and Red Giant Movies. After this film, Simbu is rumored to be doing his 48th film under the direction of Deshing Periyasamy under Kamal Haasan's production house Rajkamal Film International, but the latest news is that This film is produced by a different company. It is reported that Simbu has committed to another film It is known that Jude Antony Joseph is the director of the 2018 Malayalam film which was released last year, while it is reported that Malayalam superstar Mohanlal will play the lead role in this film .

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com