కోడంబాక్కం, న్యూస్‌టుడే: నటుడు శింబు కుటుంబ సభ్యులందరూ కలిసి థాయ్‌ల్యాండ్ విహారయాత్రకు బయలుదేరారు. హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మహా’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు శింబు. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు శింబు సోదరుడు కురళరసన్ వివాహం కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు టీఆర్, ఆయన సతీమణి ఉషా, కుమారుడు శింబు, మరో కుమారుడు కురళరసన్ దంపతులు, శింబు చెల్లెలు ఇలక్య, ఆమె భర్త, పిల్లలందరూ కలిసి థాయ్‌ల్యాండ్‌కు బయలుదేరారు. కుటుంబసమేతంగా ఉన్న ఫొటోను నటుడు శింబు ట్వీట్ చేశారు.
ANDHRA JYOTHI - TAMILNADU EDITION
0 Comments:
Post a Comment