శింబు ద్విపాత్రాభినయం (Simbu to play a dual role)


 

వినూత్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు తమిళ హీరో శింబు. త్వరలో ఆయన తన 48వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పెరియస్వామి దర్శకుడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.తాజా సమాచారం ప్రకారం హిస్టారికల్‌ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కింబోతున్నారని..ఇందులో శింబు హీరోగా, విలన్‌గా రెండు భిన్న పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. కమల్‌హాసన్‌ కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. శింబు కెరీర్‌లోనే భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తారు.


Tamil hero Simbu chooses innovative storylines and makes movies. He is gearing up for his 48th film soon. Kamal Haasan is going to produce this film under the banner of Rajkamal Film International. Periyaswamy is the director. The film will go on set in September.According to the latest information, this film is going to be made with a historical fantasy plot. In this, it is said that Simbu will be seen in two different roles as a hero and a villain. It is known that Kamal Haasan will play a key guest role. Preparations are being made to make this film at a huge cost to Simbu's career. Full details about this film will be revealed soon.

PUBLISHED IN NAMASTHE TELUNGANA DAILY TELUGU NEWSPAPER DATED 05/08/2023

0 Comments:


 

CONTACT ADMIN : teamstrofficial@gmail.com